Thursday, December 8, 2016

Bomb threat for Apollo Hospital, Chennai

apollo hospital chennaiతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. కొందరు దుండగులు ఆస్పత్రిలో బాంబు పెట్టామని బెదిరించడంతో హుటాహుటిన బ్యాంబ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. ఆస్పత్రి మొత్తాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేస్తున్నది.

తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 74 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 74 రోజులు చికిత్స అందించిన జయలలిత మృత్యువుతో పోరాటంలో విజయం సాధించలేదు. ఒకదశలో ఆమె కోలుకున్నారని, ఇక త్వరలోనే ఇంటికి పంపిస్తారని కథనాలు వచ్చాయి. ఇంతలోనే కార్డియక్‌ అరెస్టుకు గురికావడంతో సోమవారం రాత్రి జయలలిత తుదిశ్వాస విడిచారని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. అయితే, జయలలిత మృతి ప్రకటన, చికిత్స విషయంలో వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం.

Source: sakshi