గాఢనిద్ర చాలినంతగా లేకపోతే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అధికమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెమ్ దశగా వ్యవహరించే గాఢ నిద్ర తగ్గితే చక్కెర, కొవ్వు ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుందని గుర్తించారు. ఆర్‌ఈఎం దశలోని నిద్రనష్టంతో ముఖ్యంగా సూక్రోజ్, కొవ్వు పదార్థాల వినియోగం పెరుగుతున్నట్లు ఎలుకలపై చేపట్టిన అధ్యయనంలో గుర్తించారు. మనకు నిద్ర తగ్గినప్పుడు సూక్రోజ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలనే కోరికను నియంత్రించడంలో మెదడులోని మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని పేర్కొన్నారు.
Source: eenadu