Friday, December 9, 2016

New Trains to run via Guntur from Nagarsol to Tirupati during the festive season

guntur junctionనూతన సంవత్సరం పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే కొత్త జి పలు  రైలు సర్వీసులు నడపనుంది . పండుగ సమయాలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు జంక్షన్ మీదుగా తిరుపతి - నగర్సోల్ కు ప్రత్యేక రైలు ను 16 ట్రిప్పులు నడపనుంది అని దక్షిణ మధ్య రైల్వే cpro తెలిపారు. 

 నెంబర్‌ 07417 తిరుపతి - నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో(శుక్రవారం) ఉదయం 7.30 గంటలకు బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట మీదగా మరుసటిరోజు ఉదయం 11.55 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకొంటుంది. నెంబర్‌ 07418 నాగర్‌సోల్‌ - తిరుపతి ప్రత్యేక రైలు జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో(శనివారం) రాత్రి 10 గంటలకు బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా సోమవారం వేకువజామున 4 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, మూడు త్రీటైర్‌, ఏడు స్లీపర్‌క్లాస్‌, ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచలుంటాయని తెలిపారు.  



No comments:
Write comments