Friday, December 9, 2016

Best Life Lessons about Money that everyone must know

Hands, Smartphone, Rupee, India, Money, Mobile
నలుగురిలో ఉన్నప్పుడు మనం తినే పద్ధతి, మాట్లాడే తీరు.. వంటివన్నీ మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయంటారు. మరి డబ్బు విషయంలో ఎలా? అప్పుడూ కొన్ని మర్యాదలు పాటించాల్సిందే. అవేంటో తెలుసుకోండి మరి.

* నీ జీతం ఎంత? ఈ నగ ఎంత పెట్టి కొన్నావ్‌? వంటి ప్రశ్నలు చాలాసార్లు మనల్ని మొహమాటంలోకి నెట్టేస్తాయి. అలాంటప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పాలని లేదు. మౌనంగా ఉండండి. అప్రస్తుత చర్చను మధ్యలోకి తీసుకొస్తే ఆ విషయాల గురించి చెప్పడానికి మీరు ఇష్టపడరని ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అడగడం మానేస్తారు.


* సమయానికి మన దగ్గర డబ్బులు లేకనో మరో కారణం చేతనో ఒక్కోసారి స్నేహితులతో కలిసి కొన్ని బిల్లులని పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవతలి వాళ్లు కూడా మొహమాటానికి పోయి నా వాటా ఎంత అని అడగలేరు. అలాంటప్పుడు ఏ ఒక్కరిపైనా భారం పడకుండా.. అది పదిరూపాయలు అయినా సరే సమానంగా పంచుకోండి. దానివల్ల పొరపొచ్చాలు రాకుండా ఉంటాయి.

* మీరు పేదవాళ్లకు సాయం చేద్దాం అనుకున్నారు. అందుకు నలుగురు స్నేహితురాళ్లతో కలిసి కొంత డబ్బుని సేకరించి ఇచ్చారు. మీ పని పూర్తయ్యాక ఆ పనిలో సహకరించిన వాళ్లని మర్చిపోవద్దు. వ్యక్తిగతంగా అందరికీ ఈమెయిళ్లు పెట్టండి. లేదా సంక్షిప్త సందేశాలు పంపి కృతజ్ఞతలు తెలపండి. వారి డబ్బు ఏవిధంగా సద్వినియోగం అయ్యిందీ వివరంగా తెలియచేస్తే మంచిది.

* మీ స్నేహితులు ఎవరైనా చాలా అవసరం అని చెప్పి మిమ్మల్ని అడిగి డబ్బు తీసుకున్నారు. దాన్ని తిరిగి ఇవ్వకుండా.... కొత్త బట్టలూ, బ్యాగులతో కళకళ్లాడుతూ కనిపిస్తున్నారు. అలాంటప్పుడు ‘నా డబ్బులు ఇవ్వకుండా నువ్వు మాత్రం ఇవన్నీ కొనుక్కుంటున్నావా?’ వంటి ప్రశ్నలు వేయకూడదంటారు టోటల్‌ మనీ మేకోవర్‌ పుస్తకాన్ని రాసిన డావిన్‌రామ్సే. నిజానికి ఆ బట్టలు ఎవరో ఇచ్చిన కానుక కూడా కావొచ్చు. లేదా వాళ్లే కొనుక్కోవచ్చు. అందుకే వెంటనే అడగకుండా ఇచ్చేవరకూ ఆగండి. లేదంటే మీ మధ్య మనస్పర్థలు రావచ్చని చెబుతారామె.

No comments:
Write comments